గుంటూరు రేంజ్ ఐజీ శ్రీ సర్వ శ్రేష్ట త్రిపాఠి IPS మరియు జిల్లా యస్.పి. శ్రీ జి.కృష్ణకాంత్ IPS గారి ఆధ్వర్యంలో ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్‌లో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించబడింది.
ఈ సమావేశంలో శాంతి భద్రతలను పరిరక్షించడం, నేర నిర్మూలనలోని ప్రగతి గురించి చర్చించారు.
జిల్లా యస్.పి. గారిని అభినందించిన ఐజీ, లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో నెల్లూరు జిల్లా ప్రధమస్థానం సాధించినందుకు అభినందనలు తెలిపారు.
ముత్తుకూరు పరిధిలో జరిగిన దోపిడీ కేసును వేగంగా చేధించడాన్ని ప్రశంసించారు.
నాయకత్వ పటిమ మరియు మంచి వృత్తినైపుణ్యాల గురించి మాట్లాడిన ఐజీ, ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని సూచించారు.
జిల్లా గంజాయిని సమూలంగా నిర్మూలించాలని ఆదేశాలు ఇవ్వగా, రాబోయే తరాల పిల్లలకు మంచి భవిష్యత్తు కోసం సమసమాజాన్ని నిర్మించాలని చెప్పారు.
మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని మరియు శోధన జరిపి తప్పిపోయిన వారిని తల్లిదండ్రులకు అప్పగించాలనీ ఆదేశించారు.
మహిళలు, బాలికలు మరియు వృద్ధుల సమస్యలను పరిష్కరించడంపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు.
ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారించాలని, హైవేపై బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రమాదాలను నివారించాలని ఆదేశాలు ఇచ్చారు.
అన్ని ప్రాంతాల్లో CCTV కెమెరాలను ఏర్పాటు చేయాలని, రౌడీ షీటర్స్‌కు కౌన్సెలింగ్ అందించాలనీ ఆదేశించారు.
దోపిడీ, దొంగతనం కేసులపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, కుల, మత విద్వేషాలను నివారించాలనీ సూచన ఇచ్చారు. సమావేశం చివరగా, జిల్లాలోని పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించారు.