నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి 24వ పవిత్రోత్సవం బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు పంచాంగం రమణ చార్యులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం గ్రామస్తుల సహకారంతో బ్రహ్మోత్సవాలను ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ వేడుకలో స్వామివారి కృపను పొందేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారని, వారి జీవితాల్లో శాంతి, సమృద్ధి కలగాలని ఆకాంక్షించారు.
కళ్యాణ మహోత్సవం అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేయడంతో పాటు గ్రామస్థులకు స్వామివారి ఆశీస్సులు అందించాలని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు తమ మనోకామనలతో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల నినాదాలతో ఆలయ ప్రాంగణం భక్తిమయంగా మారింది.
సాయంత్రం గ్రామ వీధుల్లో పురవీధి ఉత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రథోత్సవంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. రథాన్ని గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో లాగుతూ స్వామివారికి మంగళహారతులు సమర్పించారు. గ్రామ ప్రజలందరూ కలసికట్టుగా ఈ ఉత్సవాలను నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు.
ఈ వేడుకల్లో పురోహితులు సుదర్శన చార్యులు, హరిప్రసాద్ చార్యులు, మిషన్ భగీరథ ఏఈ బిక్షపతి, గ్రామస్తులు కంఠారెడ్డి చంద్రారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, యాద గౌడ్, విశ్వనాథం, మాజీ సర్పంచ్ తమ్మన్న గారి కృష్ణవేణి, మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపిటిసి చింతల స్వామి, మహేందర్ రెడ్డి, రాజిరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మంగళి రమేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.