‘ది ఇండియా హౌస్’ సెట్లో ప్రమాదం – వర్షంలా వచ్చి పరికరాలన్నీ తీసుకెళ్లిన నీరు!

పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న భారీ చిత్రం 'ది ఇండియా హౌస్' సెట్లో తీరని ప్రమాదం జరిగింది. షూటింగ్ సమయంలో ఒక్కసారిగా వాటర్ ట్యాంక్ పగిలిపోయి, పెద్ద ఎత్తున నీరు సెట్లోకి ప్రవేశించడంతో బీభత్సం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఖరీదైన షూటింగ్ పరికరాలు ధ్వంసమయ్యాయి. హైదరాబాద్‌లో వేసిన ‘ది ఇండియా హౌస్’ చిత్రం సెట్లో భారీ నీటి ట్యాంక్ పగిలిపోయింది. ఒక్కసారిగా భారీగా నీరు సెట్లోకి ప్రవేశించి అన్ని వైపులా పారింది. అక్కడున్న కెమెరాలు, లైటింగ్ ఎక్విప్‌మెంట్, మానిటర్లు, సౌండ్ పరికరాలు నాశనం అయ్యాయి. సెట్ పూర్తిగా జలమయమవడంతో షూటింగ్ నిలిచిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా హీరో నిఖిల్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. సెట్‌లో చాలా ఖరీదైన పరికరాలు కోల్పోయాం. కానీ దేవుడి దయవల్ల ఎవరూ గాయపడలేదు. త్వరలోనే తిరిగి షెడ్యూల్ ప్రారంభిస్తాం అని ఆయన పోస్ట్‌ చేశారు. యూనిట్ వెంటనే క్లీనప్ పని మొదలు పెట్టింది. బీభత్సం జరిగినప్పటికీ, మానవీయంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఊరట కలిగించిందని టీమ్ పేర్కొంది. షూటింగ్ షెడ్యూల్ కొన్ని రోజులు ఆలస్యం కావచ్చు కానీ సినిమాపై ప్రభావం ఉండదని దర్శకుడు స్పష్టం చేశారు ఇండియా హౌస్ సెట్లో నీటి తుపాను


పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న భారీ చిత్రం ‘ది ఇండియా హౌస్’ సెట్లో తీరని ప్రమాదం జరిగింది. షూటింగ్ సమయంలో ఒక్కసారిగా వాటర్ ట్యాంక్ పగిలిపోయి, పెద్ద ఎత్తున నీరు సెట్లోకి ప్రవేశించడంతో బీభత్సం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఖరీదైన షూటింగ్ పరికరాలు ధ్వంసమయ్యాయి. హైదరాబాద్‌లో వేసిన ‘ది ఇండియా హౌస్’ చిత్రం సెట్లో భారీ నీటి ట్యాంక్ పగిలిపోయింది. ఒక్కసారిగా భారీగా నీరు సెట్లోకి ప్రవేశించి అన్ని వైపులా పారింది. అక్కడున్న కెమెరాలు, లైటింగ్ ఎక్విప్‌మెంట్, మానిటర్లు, సౌండ్ పరికరాలు నాశనం అయ్యాయి. సెట్ పూర్తిగా జలమయమవడంతో షూటింగ్ నిలిచిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా హీరో నిఖిల్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. సెట్‌లో చాలా ఖరీదైన పరికరాలు కోల్పోయాం. కానీ దేవుడి దయవల్ల ఎవరూ గాయపడలేదు. త్వరలోనే తిరిగి షెడ్యూల్ ప్రారంభిస్తాం అని ఆయన పోస్ట్‌ చేశారు. యూనిట్ వెంటనే క్లీనప్ పని మొదలు పెట్టింది. బీభత్సం జరిగినప్పటికీ, మానవీయంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఊరట కలిగించిందని టీమ్ పేర్కొంది. షూటింగ్ షెడ్యూల్ కొన్ని రోజులు ఆలస్యం కావచ్చు కానీ సినిమాపై ప్రభావం ఉండదని దర్శకుడు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *