తెలంగాణ ప్రజా పాలన వేడుకల్లో చైర్మన్ రాజయ్య

నిర్మల్‌లో జరిగిన తెలంగాణ ప్రజా పాలన వేడుకల్లో ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాల అమలు, ఉచిత ప్రయాణం, విద్యా మిషన్ అంశాలు చర్చించారు. నిర్మల్‌లో జరిగిన తెలంగాణ ప్రజా పాలన వేడుకల్లో ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాల అమలు, ఉచిత ప్రయాణం, విద్యా మిషన్ అంశాలు చర్చించారు.

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంలో నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య గారు జెండా ఆవిష్కరించారు.

రాజయ్య గారు మాట్లాడుతూ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో రెండు అమలు చేసినట్టు చెప్పారు, ఇందులో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రధానంగా ఉంది.

జిల్లాలో కోటి 14 లక్షల 56 వేల 460 మంది మహిళలు ఉచిత ప్రయాణం సద్వినియోగం చేసుకున్నారని వివరించారు.

మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే వంటగ్యాస్ అందిస్తారని, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందిస్తారని తెలిపారు.

తెలంగాణ విద్యా మిషన్ ద్వారా అంగన్వాడీలను ఫ్రీ ప్రైమరీ స్కూలుగా మార్చడం, విద్యలో నాణ్యత కోసం మిషన్ మోడల్‌ను ప్రవేశపెడుతుందని చెప్పారు.

స్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్‌లు ప్రారంభించనున్నామని ప్రకటించారు.

విద్యా బోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనలను మెరుగుపరచే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ, డిఎస్పి, అదనపు కలెక్టర్లు, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *