అమెరికా వద్ద ప్రపంచాన్ని “150 సార్లు పేల్చగల అణు సామర్థ్యం” ఉందని అధ్యక్షుడు “డొనాల్డ్ ట్రంప్” మరోసారి స్పష్టం చేశారు.
వైట్‌హౌస్‌లో విలేకర్లతో మాట్లాడిన ట్రంప్, అణ్వాయుధ నిరాయుధీకరణపై మాట్లాడుతూ, అమెరికా అణు శక్తిలో ప్రపంచంలో ముందంజలో ఉందని, ఆ తరువాత స్థానాల్లో రష్యా మరియు చైనా ఉన్నాయని పేర్కొన్నారు.
ట్రంప్ మాట్లాడుతూ, “అణు నిరాయుధీకరణ గొప్ప ఆలోచన అయినప్పటికీ, దానిపై ఇప్పటికే పుతిన్, జిన్‌పింగ్‌లతో చర్చించాను. కానీ ప్రపంచం మొత్తం అణ్వాయుధాలకు వెచ్చిస్తున్న డబ్బును అభివృద్ధి కార్యక్రమాలపై ఖర్చు చేస్తే మంచిదని” అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొనాలని తాను కోరుకుంటున్నానని కూడా ఆయన స్పష్టం చేశారు.
ALSO READ:మహిళా క్రికెటర్ శ్రీచరణికి ఏపీ ప్రభుత్వ ఘన సత్కారం – ₹2.5 కోట్లు భారీ నజరానా
ఇటీవల “ఎయిర్‌ఫోర్స్ వన్” విమానంలో మాట్లాడుతూ ట్రంప్,అమెరికా త్వరలోనే “అణు పరీక్షలు” నిర్వహించబోతోందని వెల్లడించారు. “ఇతర దేశాలు చేస్తే మనం ఎందుకు చేయకూడదు?” అని ప్రశ్నించారు.
పాకిస్థాన్ కూడా అణు పరీక్షలకు సిద్ధమవుతోందని, తాము బహిరంగంగా చేస్తామని, కానీ రష్యా, చైనా మాత్రం రహస్యంగా చేస్తాయని అన్నారు.
“ప్రపంచాన్ని 150 సార్లు పేల్చగల సామర్థ్యం మన దగ్గర ఉంది… అయినా రష్యా, చైనా మీడియా నాయకులను ప్రశ్నించే ధైర్యం విలేకర్లకు ఉందా?” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
