జాతీయ రహదారుల ప్రమాదాలపై సుప్రీంకోర్టు ఆందోళన — NHAI, కేంద్ర రవాణా శాఖకు ఆదేశాలు

Supreme Court సుప్రీంకోర్టు భవనం మరియు హైవే ప్రమాదాలపై విచారణ దృశ్యం

సుప్రీంకోర్టు జాతీయ రహదారుల్లో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌లలో ఇటీవల జరిగిన ప్రమాదాలపై స్వయంప్రేరిత విచారణ (సుమోటో) చేపట్టిన కోర్టు, రోడ్డు పరిస్థితులు దయనీయంగా ఉన్నప్పటికీ టోల్ చార్జీలు వసూలు చేయడాన్ని ప్రశ్నించింది.

జస్టిస్ జె.కె. మహేశ్వరి, విజయ్ బిష్ణోయ్ ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ, అనుమతి లేకుండా హైవేల వెంట ఉన్న దాబాలు ప్రమాదాలకు ప్రధాన కారణమని పేర్కొంది.

ALSO READ:హనుమకొండలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ప్రారంభం – జిల్లాల వారీ షెడ్యూల్ వివరాలు

ట్రక్కులు రోడ్డుపై ఆపి దాబాలకు వెళ్లడం వల్ల వెనుక నుంచి ఢీకొనే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వ్యాఖ్యానించింది.

కోర్టు NHAI మరియు కేంద్ర రవాణా శాఖకు ఆదేశాలు జారీ చేస్తూ, హైవేలపై అనుమతి లేని దాబాల సంఖ్య, రహదారి నిర్వహణ స్థితిపై వివరమైన నివేదికలు సమర్పించాలని కోరింది.

మెయింటెనెన్స్ సమయంలో కాంట్రాక్టర్లు తగిన ప్రమాణాలు పాటించారా అనే అంశంపై కూడా సమగ్ర వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. టోల్ వసూలు చేస్తున్నా రోడ్లు దెబ్బతిన్న స్థితిలో ఉండటం తీవ్ర నిర్లక్ష్యమని కోర్టు హెచ్చరించింది.

హైవేలపై జరుగుతున్న అవకతవకలు, నిర్లక్ష్యాలు ప్రాణ నష్టాలకు కారణమవుతున్నాయని, తక్షణ చర్యలు అవసరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *