వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. జాతీయ రహదారులపై ప్రయాణించే డ్రైవర్లు, ప్రయాణికులకు టోల్ భారం నుంచి కొంత ఉపశమనం లభించనుంది. టోల్ ఫీజు నిబంధనల్లో కేంద్రం కీలక సవరణలు చేసింది. ముఖ్యంగా సొరంగాలు (టన్నెల్స్) మరియు వంతెనలు (బ్రిడ్జెస్) ఉన్న రోడ్లపై టోల్ వసూలు విధానాన్ని పునర్వ్యవస్థీకరించనుంది. ఈ మార్పులతో ప్రయాణికులపై టోల్ భారం తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని చోట్ల అమలులోకి వచ్చిన ఈ మార్పులు త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ చర్య వల్ల వాహనదారులకు ఆర్థికంగా ఊరట కలిగే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రయాణాన్ని మరింత సమర్థవంతంగా చేసేందుకు ఇది ఒక పాజిటివ్ ముందడుగు అని నిపుణులు భావిస్తున్నారు.
జాతీయ రహదారుల టోల్ ఫీజు నిబంధనల్లో సవరణ
"టోల్ తగ్గింది… ఊపిరిపీల్చుకోండి
