గుడ్లవల్లేరు కాలేజీలో సీక్రెట్ కెమెరా కలకలం

ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్‌లో సీక్రెట్ కెమెరా బయటపడి, విద్యార్థినుల ఆందోళన. నిందితులపై కఠిన చర్యలు కోరుతూ నిరసన, హాస్టల్ వద్ద ఉద్రిక్తత. గుడ్లవల్లేరు కాలేజీలో సీక్రెట్ కెమెరా కలకలం

ఉమ్మడి కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిల హాస్టల్ వాష్ రూమ్ లో సీక్రెట్ కెమెరా బయటపడడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ హిడెన్ కెమెరా ద్వారా చిత్రీకరించిన ఇంజనీరింగ్ విద్యార్థినుల వీడియోలు బహిర్గతం అయ్యుంటాయని సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. 

ఈ నేపథ్యంలో, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజి వద్ద విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి… న్యాయం జరగాలి… అంటూ విద్యార్థినులు నినాదాలు చేశారు. వర్షం పడుతున్నప్పటికీ వారు ఆందోళన కొనసాగించారు. 

ఓ దశలో విద్యార్థి సంఘాల నేతలు హాస్టల్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాంతో ఇరువర్గాల మధ్య వాగ్యుద్ధం జరగ్గా, కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *