నిజాంపేట మండల కేంద్రంలో చల్మెడ గ్రామానికి చెందిన రైతు బొమ్మేన నారాయణ నిజాంపేటకు చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి,కి చెందిన ఐదు ఎకరాల పొలంను కౌలుకు చేస్తూ ఉండేవాడు అతనికి నాలుగు సంవత్సరాల నుండి పండించిన పంట డబ్బులు ఇవ్వడం లేదని గత నాలుగు రోజుల క్రితం రైతు నారాయణ, శ్రీనివాస్ రెడ్డి తో గొడవ పడగా శ్రీనివాస్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. రైతు నారాయణపై పోలీసులు కేసు నమోదు చేయడంతో రైతు నాకు న్యాయం చేయాలంటూ బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని రైతు నారాయణ కు న్యాయం చేస్తామని పోలీసులు నచ్చజెప్పడంతో రైతు నారాయణ సెల్ టవర్ దిగాడు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
