కర్నూలు జిల్లా కోసిగి మండలంలో పౌష్టికాహార మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఐసిడిఎస్ సీడీపీఓ నాగమణి తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంపై అవగాహన కల్పించాలనుకుంటున్నారు.
అంగన్వాడి టీచర్ల ఆధ్వర్యంలో శుక్రవారం ఈ పౌష్టికాహార మాసోత్సవాలు జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాల్లో గర్భవతులకు, మాత శిశులకు నాణ్యమైన పౌష్టిక ఆహారం అందిస్తుందని నాగమణి పేర్కొన్నారు.
గర్భం దాల్చిన నాటినుండి కాన్పు అయ్యేంతవరకు సంపూర్ణ పౌష్టిక ఆహారం తీసుకోవాలని సూచించారు.
ఆకుకూరలు, చిరుధాన్యాలు, కోడిగుడ్లు, రాగి పిండి వంటి పౌష్టిక ఆహారాలను గర్భవతులు వినియోగించుకోవాలని కోరారు.
ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో పిల్లలను చదివించి అక్షరాస్యతను పెంపొందించాలని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో మేజర్ సర్పంచ్ అయ్యమ్మ, సూపర్వైజర్లు, గర్భవతులు, బాలింతలు, అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.