కవితకు బెయిల్ రావడంతో కేసీఆర్ సంతోషించారు

telangana MLA kavitha telangana MLA kavitha

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టైన తన కూతురు కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తనయుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీశ్ రావులతో కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. కూతురు బాగోగులు తెలుసుకున్నారు. ఆమె రాక కోసం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ సిద్ధమవుతోంది.

కవిత అరెస్టైన మొదట్లో కేసీఆర్ ఈ అంశంపై స్పందించలేదు. అమె అరెస్టైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన తన కూతురును కలవలేదు. అయితే లోక్ సభ ఎన్నికలకు ముందు కవిత అరెస్ట్‌పై ఆయన స్పందించారు. కూతురు అరెస్టైతే ఓ తండ్రిగా బాధ ఉండదా? అని వాపోయారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి దొరికిపోయిన బీజేపీ తన కూతురును ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఇరికించిందని ఆయన ఆరోపించారు. కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *