అబ్బినేని గుంటపాలెం లో పోషకాహార అవగాహన కార్యక్రమం

అబ్బినేని గుంటపాలెం MRZP స్కూల్‌లో కిశోర బాలికలకు పోషకాహారంపై అవగాహన, పరిశుభ్రతపై అవగాహన సదస్సు, బాల్య వివాహాల ప్రభావాలపై చర్చ. అబ్బినేని గుంటపాలెం MRZP స్కూల్‌లో కిశోర బాలికలకు పోషకాహారంపై అవగాహన, పరిశుభ్రతపై అవగాహన సదస్సు, బాల్య వివాహాల ప్రభావాలపై చర్చ.

పెదనందిపాడు మండలం వరగాని సెక్టార్ లోని అబ్బి నేని గుంటపాలెంలొ పోషకాహార వారోత్సవాలు భాగంగా అబ్బినేని గుంటపాలెం MRZP school కిషోరి బాల బాలికలకు అవగాహన కార్యక్రమాన్ని సెక్టారు సూపర్ వైజర్ వి·అరుణ నిర్వహించారు.

హెచ్ ఎం. జగదీశ్వరరావు మాట్లాడుతూ పిల్లలు పోషక విలువలు ఉష్ణ ఆహారం తీసుకోవటంద్వారా పిల్లలు శారీరక మానసిక ఎదుగుదల ఉంటుంది అన్ని రంగాలలో పిల్లలు ముందు ఉండాలని తెలియ జేసినారు .

సెక్టార్ సూపర్ వైజర్ వి. అరుణ కిశోర బాలికలు అందరూ ప్రతిరోజు ఆకుకూరలు, పాలు, గుడ్లు, పండ్లు అన్నిరకాల ఆహార పదార్థాల తో పాటు ప్రతిరోజు తప్పని సరిగా చిరు ధాన్యాలను ఒక్క పూటైనా తీసుకో వాలిని తెలిపారు.

చిరుధాన్యాలలో అన్ని పోషకవిలువలు అయిన Isor cocium ఎక్కువ ఉంటాయిని తెలియ జేసినారు.

ఏఎన్ఎం పి. విజయ మాట్లాడుతూ అందరూ తప్పని సరిగాం పరిశుభ్రత ను పాటిస్తూ ఉండాలని, హ్యాండ్ వాష్ పద్దతుల గురించి వివరించారు పిల్లలు అందరూ తప్పని సరిగా హెచ్పి టెస్టులు చేయించుకోవాలని తెలిపారు.

మాథవి మాట్లాడుతూ కిషోర్ బాలికలు తప్పని సరిగా స్కూలకి వెళ్ళాలని తెలియజేశారు ఆడపిల్లలు కు బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాల గురించి తెలియ జేసినారు.

కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ కళ్యాణ్ స్వచ్ఛంద హాయ్ సేవ్ కార్యక్రమం 2021 కార్యక్రమంలో భాగంగా పరిసరాల శుభ్రత గ్రామంలో తడి చెత్త పొడి చెత్త గురించి అవగాహన సదస్సు కల్పించి ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ అరుణ. ఏఎన్ఎం విజయ మరియు హెచ్ఎం శోభారాణి, అంగన్వాడి కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు స్కూలు విద్యార్థిని విద్యార్థు లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *