YS Jagan Pulivendula Tour: నేడు పులివెందుకు  వైఎస్ జగన్

YS Jagan arriving in Pulivendula for a three-day tour and public interaction program YS Jagan arriving in Pulivendula for a three-day tour and public interaction program

YS Jagan Pulivendula tour: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందులలో మూడు రోజుల పర్యటించనున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు పులివెందుల చేరుకునే ఆయన, రాత్రి 7 గంటల వరకు ప్రజాదర్బార్ నిర్వహించి స్థానికులతో సమస్యలు, సూచనలు స్వీకరించనున్నారు.

ప్రాంతీయ ప్రజలతో నేరుగా మాట్లాడే అవకాశం దొరకడంతో ఈ కార్యక్రమంపై స్థానికంగా ఆసక్తి నెలకొంది.

ALSO READ:Zero Pollution Mission: కాలుష్యంపై చంద్రబాబు సమీక్ష – బయోషీట్లు వాడకాన్ని ప్రోత్సహించాలి

రేపు ఉదయం బ్రాహ్మణపల్లిలో అరటి తోటలను సందర్శించి రైతులతో మాట్లాడున్నారు. సాగు సమస్యలు, మార్కెట్ పరిస్థితులు, దిగుబడి అంశాలపై రైతుల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. అనంతరం పులివెందుల క్యాంప్ ఆఫీసులో మరో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు.

జగన్ పర్యటనలో భద్రత, ఏర్పాట్లు విస్తృతంగా జరుగుతున్నాయి. మూడు రోజుల పర్యటన అనంతరం గురువారం ఉదయం 8 గంటలకు పులివెందుల నుంచి బెంగళూరుకు బయల్దేరనున్నారు. ఆయన వ్యవహారాలు, స్థానిక పర్యటనలు పులివెందుల రాజకీయ వాతావరణాన్ని మరోసారి కదిలిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *