కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల రెడ్డిపేట తండా విద్యార్థులు నవదీప్ 10 వ తరగతి, నవదీప్ 9వ తరగతి విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్ లోని ముదిరాజ్ భవన్ , పటాన్ చెరువులో జరిగిన రాష్ట్ర స్థాయి యోగా పోటీలలో ఆర్టిస్టిక్ పెయిర్ మరియు రిథమిక్ పెయిర్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ జి. వేణుగోపాల్ రావు తెలియచేసారు.
విద్యార్థులకు సహకారం అందించిన పాఠశాల ఉపాద్యాయిని శ్రీమతి & శ్రీ జి. శ్రీలత అనిల్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ విద్యార్థులు బెంగళూరులో నవంబర్ నెలలో జరిగే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటారని ప్రధానోపాధ్యాయులు శ్రీ జి. వేణుగోపాల్ రావు , యోగాచార్యులు శ్రీ అనిల్ రెడ్డి తెలిపారు.