లోక్ సభలో ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి జమ్ము కశ్మీర్ వేర్పాటువాది యాసిన్ మాలిక్ భార్య ముశాల్ హుస్సేన్ ముల్లిక్ లేఖ రాసింది. ఈ లేఖలో, తన భర్త యాసిన్ మాలిక్ జమ్ము కశ్మీర్‌లో శాంతిని నెలకొల్పుతాడని చెప్పిన ఆమె, అందుకే తన భర్తకు న్యాయం జరిగేలా చూడాలని కోరింది. ప్రస్తుతం జైల్లో ఉన్న యాసిన్ మాలిక్ జమ్ము కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ చీఫ్‌గా ఉన్నారు.
ముశాల్ హుస్సేన్ తన భర్త జైల్లో ఉన్న విషయాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తాలని రాహుల్ గాంధీని కోరింది. ఆమె చెప్పినట్లు, యాసిన్ మాలిక్ జమ్ము కశ్మీర్‌లో శాంతి సాధించడానికి శక్తిగా మారవచ్చని, అయితే ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, ఆయన విషయంలో జోక్యం చేసుకోవాలని కోరింది.
ముశాల్ హుస్సేన్ మాలిక్ జైల్లో హింసకు గురవుతుండగా, రాహుల్ గాంధీ తన భర్తకు న్యాయం జరిగేలా చూడాలని మల్లి అభ్యర్థించింది.