జామ్‌నగర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్

Reliance plans to build the world's largest data center in Jamnagar, Gujarat, with 3 GW capacity, using advanced AI chips for AI computing. Reliance plans to build the world's largest data center in Jamnagar, Gujarat, with 3 GW capacity, using advanced AI chips for AI computing.

భారత్ టెక్నాలజీ రంగంలో వేగంగా పురోగమిస్తోంది. దీని భాగంగా దేశీయ దిగ్గజ కంపెనీలు తమ వంతుగా భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. ముఖ్యంగా, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ను నిర్మించనున్నారు. ఈ డేటా సెంటర్ 3 గిగావాట్ల సామర్థ్యంతో ఉండనుంది.

ఈ డేటా సెంటర్ నిర్మాణం కోసం రిలయన్స్ అధునాతన ఏఐ చిప్‌లను కొనుగోలు చేయనుంది. అధునాతన టెక్నాలజీతో నిర్మించబోయే ఈ సెంటర్ భారత్‌లో డిజిటల్ మౌలిక వసతులను విస్తృతంగా పెంచే అవకాశం ఉంది. భారీ డేటా నిల్వకు, ఏఐ కంప్యూటింగ్‌కు ఈ సెంటర్ కేంద్రంగా మారనుంది.

2023 అక్టోబర్‌లో రిలయన్స్, ఎన్విడియా కలిసి ఏఐ మౌలిక వసతుల ఏర్పాటుపై చర్చలు జరిపాయి. భవిష్యత్‌లో భారత్‌ను ప్రపంచ ఏఐ కేంద్రంగా మార్చే లక్ష్యంతో రిలయన్స్ అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా భారత ఐటి రంగానికి కొత్త శకం ప్రారంభమవుతుందని అంచనా.

ముఖేశ్ అంబానీ మాట్లాడుతూ, దేశంలోని ప్రతి ఒక్కరికీ ఏఐని అందుబాటులోకి తీసుకురావడమే తన లక్ష్యమని తెలిపారు. ఈ డేటా సెంటర్ భారతదేశానికి భారీ టెక్నాలజీ పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు, ఆర్థికంగా కూడా మూడో అతిపెద్ద డిజిటల్ హబ్‌గా దేశాన్ని తీర్చిదిద్దనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *