అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం పట్టణంలోని 8 ఫీట్రో రోడ్డులో 3K రన్ & వాక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ మెగా ఈవెంట్‌ను GNV జువెలరీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించగా, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళా సాధికారత, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్వాతి శంకర్ మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పోటీ పడుతూ ప్రగతి సాధిస్తున్నారని ప్రశంసించారు. మహిళల విజయాలను ఒకరోజు ఉత్సవంగా జరుపుకోవడం కాకుండా, ప్రతి రోజు మహిళలు తమ జీవితాన్ని విజయవంతంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. సమాజంలో మార్పు తీసుకురావడానికి మహిళల భాగస్వామ్యం అత్యవసరమని, మహిళలు మార్గదర్శకులుగా నిలవాలని అన్నారు.
ఈ సందర్భంగా 3K రన్ & వాక్ పోటీలో పాల్గొన్న విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ పోటీలు మహిళలకు ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంతో పాటు, వారి సామర్థ్యాన్ని నమ్ముకునేలా చేయడమే లక్ష్యంగా నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి మహిళలు, యువతులు పెద్ద ఎత్తున హాజరై, ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ వేడుకల్లో ప్రముఖ మహిళా సంఘాల ప్రతినిధులు, వివిధ సంస్థల సభ్యులు, జువెలరీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. మహిళల సాధికారతకు మద్దతుగా అలాంటి కార్యక్రమాలు మరింతగా నిర్వహించాలనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేశారు.