ఉత్తరప్రదేశ్ అలీఘర్‌లో వారం క్రితం సంచలనం కలిగించిన ఘటన ఇప్పుడు మరో మలుపు తిరిగింది. తన కూతురి కాబోయే భర్త రాహుల్‌తో కలిసి పరారైన స్వప్న అనే మహిళ తాజాగా రాహుల్‌తో కలిసి పోలీసుల ముందుకు హాజరైంది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
స్వప్న తన భర్త తాగి వచ్చి తరచూ కొట్టేవాడని, తన కూతురు కూడా తరచూ గొడవలు పెట్టేదని వాపోయింది. ఆ పరిస్థితుల నుంచి బయటపడేందుకు రాహుల్‌తో వెళ్లిపోయానని తెలిపింది. తనపై ఆరోపణలైన డబ్బులు, బంగారం తీసుకెళ్లినట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ లేదని తేల్చింది.
రాహుల్ మాట్లాడుతూ స్వప్న తనను బలవంతంగా బస్టాండ్‌కు రాకపోతే ప్రాణాలు తీసుకుంటానని బెదిరించిందని తెలిపాడు. దీంతో భయంతో ఆమెతో కలిసి లక్నో, తర్వాత ముజఫర్‌నగర్‌కు వెళ్లామని వెల్లడించాడు. తనకు స్వప్నపై ప్రేమ ఉందని, పెళ్లి చేసుకోవాలనుందని చెప్పాడు.
ఇంతలో స్వప్న సోదరుడు స్పందిస్తూ ఆమెను ఇంట్లోకి అనుమతించబోమని తేల్చిచెప్పాడు. ఆమె తీసుకెళ్లిన డబ్బులు, నగలు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తన అక్కపై చేసిన ఆరోపణల్లో నిజం లేదని, ఆమెనే తప్పుగా వ్యవహరించిందని ఆరోపించాడు. కుటుంబం ఆమెను తిరిగి అంగీకరించదని స్పష్టం చేశాడు.