పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం తిత్తిరి పంచాయతీలో గత వారం రోజులుగా అడవి ఏనుగుల గుంపు తిష్ట వేసి పంటలను నాశనం చేస్తూ తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి ఏనుగులను తరలించాలని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి కుంకి ఏనుగులు తీసుకువచ్చి ఈ అడవి ఏనుగులను తరలించేలా చర్యలు తీసుకోవాలని గిరిజన రైతులు కోరుతున్నారు. అలాగే ఏనుగుల వలన పంట నష్టమైన రైతులకు నష్టపరిహారం అందించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
తిత్తిరి పంచాయతీలో అడవి ఏనుగుల దౌర్జన్యం
