- వెంకటేశ్వరస్వామిని దర్శించిన మంత్రి పొంగూరు నారాయణ దంపతులు
- స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసిన దంపతులు
నెల్లూరులోని మంత్రి నివాసం వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని…రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆయన సతీమణి పొంగూరు రమాదేవిలు దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు పొంగూరు దంపతులకి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పొంగూరు నారాయణ, పొంగూరు రమాదేవీలు శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. ప్రజలందరిపై గోవిందుడి ఆశీస్సులు, దీవెన్నలు ఎల్లప్పుడూ ఉండాలని వారు ఆకాంక్షించారు.