గుంటుపల్లి ఇసుక రేవు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలన చేపట్టారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నట్లు తెలిపారు.
ప్రాధమిక దర్యాప్తులో మృతుడు 15 రోజుల క్రితం మరణించి ఉండవచ్చని ఫోరెన్సిక్ బృందం భావిస్తోంది. హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా పరిశీలన చేయడం కొనసాగిస్తున్నారు. మృతదేహం గుర్తింపు కోసం అన్ని పోలీస్ స్టేషన్లలో సమాచారం అందజేశారు.
మృతుడికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. అతనిపై దాడి జరిగిందా, లేక జీవితం పట్ల విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడా అనే దానిపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా మరింత స్పష్టత రానుంది.
స్థానికులు ఈ ఘటనపై భయాందోళనకు గురవుతున్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడం వల్ల ఘటన వెనుక అసలు కారణం తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ కేసును పూర్తి సీరియస్‌గా తీసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.