యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. న్యూ హాంప్‌షైర్ రాష్ట్రంలోని డిక్స్‌విల్లే నాచ్ పట్టణంలో తొలి ఓట్లు వేసిన ఆరుగురు ఓటర్లు అర్ధరాత్రి సమయంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడి టిల్లోట్‌సన్ రూమ్‌లో జరిగే ఓటింగ్ సంప్రదాయంగా మొదటి ఓట్లుగా పరిగణిస్తారు.
ఈసారి ఓటింగ్ చేసిన ఆరుగురిలో ముగ్గురు కమలా హారిస్‌కు, ముగ్గురు డొనాల్డ్ ట్రంప్‌కు ఓటు వేశారు. ఈ విధంగా రెండు ప్రధాన అభ్యర్థుల మధ్య సమాన ఓట్లు పడ్డాయి. ఈ ఫలితం అమెరికా రాజకీయ వర్గాల్లో గట్టి పోటీకి సంకేతంగా భావిస్తున్నారు.
ఓటర్లలో ఒకరు మాట్లాడుతూ, “కమలా హారిస్‌కు ఓటు వేశానని, అధ్యక్షుడు నా కోసం పనిచేయాలి” అని చెప్పారు. ట్రంప్‌కు ఓటు వేయకపోవడానికి ఇది ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు.