ధర్మవరం పట్టణంలో డీఎస్పీ శ్రీనివాసులు గారి ఆదేశాల మేరకు వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో దొంగలపై చర్యలు తీసుకున్నారు. కళాజ్యోతి సర్కిల్ మరియు అంజుమాన్ సర్కిళ్లలో మహిళలను మోసం చేసి వారి వద్ద ఉన్న బంగారు నగలను దొంగిలించిన కేసులో సాకే నారాయణను అరెస్ట్ చేశారు.
నిందితుడు సాకే నారాయణ లంకెపురంలో రాత్రి ఇంటి తాళాలను పగలగొట్టి బంగారం దొంగతనం చేసిన ఘటనలో నిందితుడిగా గుర్తించారు. అతని వద్ద నుండి దొంగిలించబడిన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగతనాలు ధర్మవరం పట్టణంలో భయాందోళనలు కలిగించాయి.
వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది గోపి కుమార్, శివకుమార్, శివశంకర్, భాస్కర్ల సహకారంతో నిందితుడిని పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. ఆపరేషన్ విజయవంతమైనందుకు డీఎస్పీ శ్రీనివాసులు వారిని ప్రత్యేకంగా అభినందించారు.
మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని డీఎస్పీ పేర్కొన్నారు. ప్రజలు ఏవైనా అనుమానాస్పద వ్యక్తుల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.