మత్తు పదార్థాలు మాదకద్రవ్యాలను నియంత్రించేందుకు తెలంగాణ పోలీస్ ఉక్కు పాదం మోపుతుంది గత కొద్ది రోజుల క్రితం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో భారీగా గంజాయి మత్తుకు అలవాటు పడిన బంగారు భవిష్యత్తును చిత్రం చేసుకుంటున్న యువతపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో గంజాయికి బానిసలుగా మారుతున్న యువత పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సిపి సునీల్ దట్ యాంటీ డ్రగ్స్ ప్రోగ్రాం చేపట్టారు. కల్లూరు ఏసిపి ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన అవగాహన సదస్సుకు సిపి సునీల్ దత్ హాజరై పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం సిపి సునీల్ దత్ మాట్లాడుతూ… మత్తుకు బానిసలై యువత భవిష్యత్తు నాశనం చేసుకుంటుందని అన్నారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి డబ్బులు కోసం గంజాయి రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని అలాంటి యువతపై తల్లిదండ్రులు ఒక కన్నేసి ఉంచాలని గంజాయి మదకద్రవ్యాలు సేవించడం అమ్మడం నేరమని సిపి హెచ్చరించారు. ఎవరైనా మత్తు పదార్థాలు అమ్మిన సేవించిన నేరమని అలాంటి సమాచారాన్ని బాధ్యతగా పోలీసులకు తెలియజేయాలని ఆయన అన్నారు. స్టూడెంట్స్ టార్గెట్ చేసుకొని డబ్బు సంపాదించేందుకు కొందరు స్మగ్లర్లు ప్రయత్నం చేస్తారని అలాంటివారికి యువత దూరంగా ఉండాలని చదువుకునే యువకులకు సూచించారు గంజాయి మాదకద్రవ్యా లాంటి మత్తు పదార్థాలను నియంత్రించేందుకు మీడియా కూడా కీలకపాత్ర పోషించాలని కోరారు.
తెలంగాణలో మత్తు పదార్థాల నియంత్రణపై ఉక్కుపాదం
