Telangana EMRS విజేతలకు CM రేవంత్ రెడ్డి అభినందనలు  

Telangana EMRS students celebrate winning overall championship at EMRS Sports Meet 2025 Telangana EMRS students celebrate winning overall championship at EMRS Sports Meet 2025

EMRS Sports Meet 2025: Telangana EMRS విజేతలను CM రేవంత్ రెడ్డి అభినందించారు. ఒడిశాలోని రూర్కేలాలో నవంబర్ 11 నుంచి 15 వరకు జరిగిన జాతీయ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) స్పోర్ట్స్ మీట్ 2025లో తెలంగాణ విద్యార్థులు రికార్డ్ స్థాయి ప్రదర్శన కనబర్చి  ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు.

అథ్లెటిక్స్, ఆర్చరీ, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, బాక్సింగ్, జూడో, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, టైక్వాండో, యోగా, షూటింగ్, చెస్ తదితర విభాగాల్లో మొత్తం 230 పతకాలు (88 బంగారు, 66 వెండి, 76 కాంస్య) సాధించి దేశంలోని అన్ని రాష్ట్రాలను అధిగమించారు.

ALSO READ: YV Subba Reddy SIT | అంతా అధికారులే చేశారు… SIT విచారణలో సంచలన వ్యాఖ్యలు

ఈ క్రీడల్లో తెలంగాణకు చెందిన EMRS సంస్థల 23 పాఠశాలల నుంచి 580 మంది విద్యార్థులు పాల్గొన్నారు. దేశం నలుమూలల నుంచి 22 రాష్ట్రాల 499 EMRS సంస్థలకు చెందిన 5,500 మంది విద్యార్థులు పోటీలో పాల్గొన్నారు.

మొత్తం 22 ఈవెంట్లలో 15 వ్యక్తిగత, 7 జట్టు విభాగాల్లో తెలంగాణ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించారు.

ఓవరాల్ విజయం తర్వాత విద్యార్థులు హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. సీఎం విద్యార్థులను అభినందిస్తూ, భవిష్యత్తులోనూ ఈ స్థాయి క్రీడాస్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *