ఉపాధ్యాయుల్లో “టెట్” విషయంలో టెన్షన్(Teachers TET Tension) పెరిగింది. పీఈటీలు, పీడీలు మినహా ఇతర ఇన్సర్వీస్ టీచర్లు వచ్చే రెండు సంవత్సరాల్లో తప్పనిసరిగా TET అర్హత సాధించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ నిర్ణయం పదోన్నతులు, ఉద్యోగ భద్రతపై ప్రభావం చూపుతుందన్న భయం టీచర్లలో పెరిగింది.
ALSO READ:Telangana Next BJP Govt వస్తుంది బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10 వేల మంది ఉపాధ్యాయుల్లో సుమారు 90% మందికి ఇప్పుడు టెట్(TET Exam) తప్పనిసరి అవుతోంది. ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు ఈ అంశంపై ఎన్సీటీఈ, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తూ మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇన్సర్వీస్ ఉపాధ్యాయుల(In-Service Teachers) పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పునర్విమర్శ చేయాలని సంఘాలు కోరుతున్నాయి.
