నిర్మల్ జిల్లాలో డీఎస్సీ 2024 ద్వారా ఉపాధ్యాయ నియామకాలు

In Nirmal district, 278 candidates have been selected for teacher positions through DSC 2024, with appointment letters to be handed out by the Chief Minister. In Nirmal district, 278 candidates have been selected for teacher positions through DSC 2024, with appointment letters to be handed out by the Chief Minister.

నిర్మల్ జిల్లాలో డీఎస్సీ 2024 ద్వారా 342 ఖాళీలకు గాను అందులోనుండి 278 అభ్యర్థులు ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం జరిగిందని, గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.రవీందర్ రెడ్డి తెలిపారు.

27 కేటగిరీల్లో 278 ఎంపిక చేయడం జరిగిందని వివిధ కేటగిరి రోస్టర్ పాయింట్లలో అభ్యంతర అభ్యర్థులు లేనందువల్ల కొన్ని ఖాళీగా మిగిలిపోయాయని ఇందులో ప్రత్యేక విద్య ఉపాధ్యాయులు 28 మంది ఎస్టీ ఉర్దూ ఉపాధ్యాయులు 25 మంది, 7ఎస్జీటీలు, మిగతా కేటగిరి పోస్టులు నాలుగు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.

డీఎస్సీ ద్వారా అందరికీ ఉద్యోగులు రావడం నిర్మల్ జిల్లాకు శుభ సూచకమని అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. నిర్మల్ నుండి ఐదు బస్సులు బైంసా ప్రాంతం నుండి రెండు బస్సులు బయలుదేరు వెళ్తున్నాయని బస్సులో మెడికల్ సిబ్బంది, పోలీసు సిబ్బంది అందరికీ టిఫిన్ భోజనం ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *