పల్లెలు ప్రగతే కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని మండల టిడిపి సీనియర్ నాయకులు, మాజీ జడ్పిటిసి కరక సత్యనారాయణ అన్నారు.
సోమవారం నాతవరం మండలంలో గల పి. జగ్గంపేట, పీకే.గూడెం,గునుపూడి,ఎస్ బి.పట్నం చిన గొలుగొండ పేట గ్రామాల్లో పల్లె పండగ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ డ్రైనేజ్, సిసి రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు.
నాతవరం మండలానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు.
ఇప్పుడు ఏదైతే గ్రాంట్స్ తో నిర్మాణాలకు శంకుస్థాపన చేశారో దానికి సంబంధించిన పనులు ఫిబ్రవరి నెల లోపల పూర్తి చేయాలని, ఆ విధంగా పూర్తి చేసినట్లయితే మరింత గ్రాంట్స్ మంజూరు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.