
చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ – ఎస్‌సీఓ సమ్మిట్‌లో మోదీ హాజరు ధృవీకరణ
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ మంగళవారం న్యూఢిల్లీలో చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 వరకు చైనా తియాంజిన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారని ఆయన వెల్లడించారు. ఇది మోదీ పాల్గొనబోతున్నారన్న మొదటి అధికారిక ధ్రువీకరణగా నిలిచింది. అజిత్ డోభాల్ మాట్లాడుతూ, “భారత్–చైనా సంబంధాల్లో కొత్త ఉత్సాహం, శక్తి కనిపిస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి…