సిట్ విచారణకు డుమ్మా కొట్టిన సుబ్బారెడ్డి
కల్తీ నెయ్యి స్కాంలో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విచారణకు రాకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నవంబర్ 13న విచారణకు హాజరుకావాలని సిట్ అధికారులు నోటీసులు పంపినా, సుబ్బారెడ్డి తనకు ఆ తేదీ కుదరదని, నవంబర్ 15 తరువాత హాజరవుతానని సమాధానం ఇచ్చారు. వారం రోజుల గడువు కోరిన ఆయన ప్రవర్తనపై అధికారులు అనుమానంతో ఉన్నారు. ప్రస్తుతం సుబ్బారెడ్డి కోర్టు ద్వారా విచారణను వాయిదా వేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన బ్యాంకు లావాదేవీల వివరాల…
