Rajinikanth Tirumala Darshan | కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్
Rajinikanth Tirumala Darshan: దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ తిరుమల శ్రీవారి సన్నిధిలో దర్శనం చేసుకున్నారు. శుక్రవారం తిరుమలకు చేరుకున్న రజినీ, శనివారం తెల్లవారుజామున వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం చేశారు. ముందుగానే ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు ప్రత్యేకంగా దర్శన సౌకర్యం కల్పించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం నిర్వహించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. రజినీకాంత్ భార్య లతా, కూతుళ్లు ఐశ్వర్య, సౌందర్య, మనవళ్లు…
