విజయవాడ బుడమేరులో వరద ప్రవాహం పెరిగింది. 8 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండడంతో, గండ్లను పూడ్చే పనులు మంత్రులు నారా లోకేశ్, నిమ్మల రామానాయుడు పర్యవేక్షిస్తున్నారు.

విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనుల్లో అపశృతి

విజయవాడలో వరద ముంపు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. విధినిర్వహణలో ఉన్న కోటేశ్వరరావు అనే విద్యుత్ లైన్ మన్ వరదకు కొట్టుకుపోయి మృతి చెందాడు.  దీనిపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లైన్ కోటేశ్వరరావు కుటుంబానికి సానుభూతి తెలిపారు. భార్య మాధవి, కుటుంబ సభ్యులకు ఆయన ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. లైన్ మన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు.  ఇటీవల కురిసిన…

Read More
భారీ వరదల సమయంలో తెలుగు రాష్ట్రాల సీఎం సహాయనిధులకు బాలకృష్ణ, ఎన్టీఆర్, సిద్ధు, విశ్వక్సేన్ విరాళాలు ప్రకటించి, బాధితులకు సాయంగా నిలిచారు.

వరదల కారణంగా నష్టపోయిన రాష్ట్రాలకు సెలబ్రిటీల సాయ హస్తం

భారీ వరదల కారణంగా ఇరు తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు చిత్ర పరిశ్రమ ముందుకు వస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు విరాళాలను ప్రకటించారు. తాజాగా నందమూరి బాలకృష్ణ కూడా తన వంతుగా భారీ విరాళాన్ని ప్రకటించారు. ఏపీ సీఎం సహాయనిధికి రూ. 50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50 లక్షలు అందిస్తున్నానని తెలిపారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో బాధాతప్త హృదయంతో ఈ సాయాన్ని అందిస్తున్నానని చెప్పారు. రెండు…

Read More
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు నెల జీతాలను 2,44,565 ఉద్యోగులకు నిలిపివేసింది. ఆస్తి వివరాలు అందించకపోవడంతో చర్య తీసుకోగా, 71% ఉద్యోగులు మాత్రమే వివరాలు అప్‌లోడ్ చేశారు.

UP ప్రభుత్వం 2.44 లక్షల ఉద్యోగుల జీతాలను నిలిపివేసింది

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఏకంగా 2,44,565 మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. ఆస్తి వివరాలు వెల్లడించని ఉద్యోగులు అందరికీ ఆగస్టు నెల జీతాలను నిలిపివేసింది. ఉద్యోగులు ఆన్‌లైన్‌ వేదికగా తమ ఆస్తి వివరాలను ఆగస్టు 31 లోగా వెల్లడించాల్సి ఉంది. అయితే గడువు తేదీలోగా వివరాలను పొందుపరచకపోవడంతో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో 2,44,565 మంది ఉద్యోగులకు ఆగస్టు నెల జీతాలు పడలేదని…

Read More
ఉపాసన, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కార్యక్రమంలో మహిళలకు హెల్త్ కేర్ రంగంలో వ్యాపార సాయం అందించనున్నట్టు తెలిపారు. కో-ఫౌండర్‌గా సహాయం చేయడానికి యువ మహిళలు ముందుకు రావాలని పిలుపు.

మహిళలకు వ్యాపార సాయం అందిస్తానని అపోలో హాస్పిటల్స్ ఎండీ ఉపాసన ప్రకటించారు

మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు తనవంతుగా సాయం చేస్తానని హీరో రాంచరణ్ శ్రీమతి, అపోలో హాస్పిటల్స్ ఎండీ ఉపాసన పేర్కొన్నారు. తాజాగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఉపాసన పాల్గొని మాట్లాడారు. హెల్త్ కేర్ రంగంలో మహిళలను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. వారు చేపట్టబోయే వ్యాపారానికి కో ఫౌండర్ గా ఉండడంతో పాటు అవసరమైన సాయం అందిస్తానని చెప్పారు. తనతో కలిసి వ్యాపారం చేయడానికి ఔత్సాహిక యువ మహిళలు ముందుకు రావాలని కోరారు. భారతదేశంలో హెల్త్…

Read More
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలలో జానీ మాస్టర్ 2034లో జ‌న‌సేనాని ప్రధానిగా కూర్చొంటారని చెప్పారు. అభిమానులు ఆనందంతో కేరింతలు కొట్టారు. 'గబ్బర్ సింగ్' మూవీ రీ-రిలీజ్ కూడా సంబరంగా జరిగింది.

ప‌వ‌న్ కళ్యాణ్ పుట్టిన రోజున జానీ మాస్ట‌ర్ పెద్ద ప్రకటన

సోమ‌వారం జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన‌రోజు కావ‌డంతో అభిమానులు భారీ ఎత్తున వేడుక‌లు నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో ఒక‌చోట వేడుక‌ల్లో పాల్గొన్న జ‌న‌సేన నేత‌, ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 2034లో జ‌న‌సేనాని ప్ర‌ధాని అవుతార‌ని చెప్పుకొచ్చారు.  జానీ మాస్ట‌ర్ మాట్లాడుతూ.. “ప‌వ‌ర్ స్టార్ ఇప్పుడు డిప్యూటీ సీఎం. 2029లో ముఖ్య‌మంత్రి అవుతారు. అలాగే 2034లో ప్ర‌ధాన‌మంత్రి అవుతారు. ఇది రాసుకోండి. జై జ‌న‌సేన” అని అన్నారు. జానీ…

Read More
అమీన్ పూర్ మండలంలో 20 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణను హైడ్రా తిరిగి స్వాధీనం చేసుకుంది. నిర్మాణాలు కూల్చి, సరిహద్దు రాళ్లను తొలగించారు. స్కూల్ యాజమాన్యం ఆక్రమించిన 15 గుంటలు కూడా కూల్చివేశారు.

అమీన్ పూర్‌లో ప్రభుత్వ భూమి ఆక్రమణ తొలగింపు

సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పూర్ మండలంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలం 20 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి హైడ్రా రంగంలోకి దిగింది. ఆక్రమణలను తొలగించాలంటూ రెవెన్యూ అధికారులను ఆదేశించింది. దీంతో ప్రభుత్వ భూమిని ఆక్రమించిన నిర్మించిన కట్టడాలను కూల్చేస్తూ, సరిహద్దు రాళ్లను రెవెన్యూ సిబ్బంది తొలగించారు. స్థానికుల ఫిర్యాదుతో స్పందించిన అధికారులు.. సర్వే నంబర్‌ 119లో గుర్తుతెలియని వ్యక్తులు వేసిన ప్లాట్లను తొలగించారు. ఈ భూమిలో ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం 15 గుంటలు ఆక్రమించినట్లు…

Read More
గుజరాత్ తీరంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన హెలికాప్టర్‌ పైలట్ల కోసం గాలింపు కొనసాగుతోంది. ఒక డైవర్ రక్షించగా, మరో డైవర్, ఇద్దరు పైలట్ల కోసం 4 నౌకలు, 2 విమానాలతో గాలింపు.

గుజరాత్ తీరంలో హెలికాప్టర్ గల్లంతు

సముద్రంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ తర్వాత గల్లంతైన ఇద్దరు హెలికాప్టర్ పైలట్లు, ఒక డైవర్ కోసం భారత తీర రక్షక దళం (ఇండియన్ కోస్ట్‌గార్డ్) పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టింది. నలుగురు సిబ్బంది, ఇద్దరు పైలట్లతో వెళ్తున్న హెలికాప్టర్ గుజరాత్‌లోని పోర్‌బందర్ తీరంలో గత రాత్రి అత్యవసరంగా ల్యాండ్ అయింది.  హెలికాప్టర్.. నౌకను సమీపిస్తుండగా ఈ ఘటన జరిగినట్టు కోస్ట్‌గార్డు అధికారులు తెలిపారు. గల్లంతైన ఇద్దరు డైవర్లలో ఒకరిని రక్షించామని, మరో డైవర్, ఇద్దరు పైలట్ల కోసం…

Read More