బుడమేరులో 90% ఆక్రమణ విజయవాడకు శాపమైందని, సీఎం చంద్రబాబు సమర్థవంతంగా పని చేస్తున్నారని పవన్ కల్యాణ్ ప్రశంసించారు.

బుడమేరులో జరిగిన ఆక్రమణల గురించి పవన్ కల్యాణ్ విమర్శలు

బుడమేరులోని 90 శాతం ఆక్రమణకు గురైందని, ఇదే ఇప్పుడు విజయవాడకు శాపంగా మారిందని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. అమరావతిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు సమర్థవంతంగా పని చేస్తున్నారని కితాబునిచ్చారు. ఈ వయస్సులో కూడా జేసీబీలు, ట్రాక్టర్లను ఎక్కి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన బాగా పని చేస్తుంటే ప్రశంసించాల్సింది పోయి వైసీపీ నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ముందు…

Read More
'ఎమర్జెన్సీ' చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వమని కంగన విజ్ఞప్తి చేసినా, బాంబే హైకోర్టు అది చేయలేమని తేల్చిచెప్పింది.

ఎమర్జెన్సీ సినిమాపై కంగనాకు హైకోర్టులో షాక్

ప్రముఖ బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కు బాంబే హైకోర్టులో షాక్ తగిలింది. ఆమె స్వయంగా దర్శకత్వం వహించి, నటించి, నిర్మించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని కేంద్ర సెన్సార్ బోర్డును తాము ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చే విషయంలో సెప్టెంబర్ 18వ తేదీ లోపు ఒక నిర్ణయం తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు సూచించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 19వ తేదీకి వాయిదా వేసింది. మాజీ ప్రధాని…

Read More
హైడ్రా పేరుతో బిల్డర్లను బెదిరించిన విప్లవ్ సిన్హాను పోలీసులు అరెస్టు చేశారు. రూ.20 లక్షలు డిమాండ్ చేసినట్లు వెల్లడైంది.

హైడ్రా పేరుతో బిల్డర్లను బెదిరించిన విప్లవ్ సిన్హా అరెస్ట్

‘హైడ్రా చీఫ్ రంగనాథ్ నాకు బాగా క్లోజ్.. రూ.20 లక్షలు ఇస్తే హైడ్రా బుల్డోజర్లు మీ నిర్మాణాల జోలికి రాకుండా చూస్తా.. లేదంటే కూల్చేయిస్తా’ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సామాజిక కార్యకర్తనని, సామాజిక సేవకుడినని చెప్పుకుంటూ విప్లవ్ సిన్హా అనే వ్యక్తి అమీన్ పూర్ లో బిల్డర్లను బెదిరించాడు. తనకు డబ్బులు ఇవ్వకుంటే మీడియాలో మీ నిర్మాణాల గురించి అసత్యాలు రాయించి, హైడ్రాకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు. దీంతో బిల్డర్లు…

Read More
హర్యానాలో స్వీపర్ పోస్టుకు 39,990 గ్రాడ్యుయేట్లు, 6,112 పోస్టు గ్రాడ్యుయేట్లు, 1.2 లక్షల అండర్ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకున్నారు. 15 వేల వేతనం.

స్వీపర్ పోస్టుకు గ్రాడ్యుయేట్ల దరఖాస్తులు.. నిరుద్యోగం ఘనత..

దేశంలో నిరుద్యోగిత ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇంతకు మించిన ఉదాహరణ అవసరం లేదేమో. హర్యానాలో ఓ స్వీపర్ పోస్టుకు వేలాదిమంది గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు పోటీపడ్డారు. కాంట్రాక్ట్ స్వీపర్ ఉద్యోగాలకు హర్యానా కౌశల్ రోజ్‌గార్ నిగమ్ లిమిటెడ్ (హెచ్‌కేఆర్ఎన్)  దరఖాస్తులు ఆహ్వానించింది.  1.2 లక్షల మంది అండర్ గ్రాడ్యుయేట్లు కూడా..నోటిఫికేషన్ వచ్చీరావడంతోనే 39,990 మంది గ్రాడ్యుయేట్లు, 6,112 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకున్నారు. వీరు కాకుండా ఆగస్టు 6 నుంచి సెప్టెంబరు 2 మధ్య…

Read More
సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరద బాధితులకు ఒక నెల జీతం విరాళం ప్రకటించారు.

బీఆర్ఎస్ సహాయక చర్యలుగా ఒక నెల జీతం విరాళంగా ప్రకటించారు

రాష్ట్రంలో వరద బాధితులకు బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు విరాళం ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రకటించారు. వరద బాధితులను ఆదుకోవాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని, అందులో భాగంగా తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించామన్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వరదల వల్ల సర్వం కోల్పోయి ఇబ్బందిపడుతున్న ప్రజలకు అండగా నిలవాలని, ఇప్పటికే బీఆర్ఎస్ పక్షాన సహాయక చర్యలు…

Read More
బుడమేరులో వరదల నేపథ్యంలో, నారా లోకేశ్ గండ్లను పూడ్చే పనులను పర్యవేక్షిస్తున్నారు. 10 వేల క్యూసెక్కుల ప్రవాహంతో ప్రజలకు అప్రమత్తంగా ఉండమని సూచించారు.

బుడమేరులో సహాయ చర్యలు…..నారా లోకేశ్ పర్యవేక్షణ….

విజయవాడను ముంచెత్తిన బుడమేరు గండ్లను పూడ్చివేసే కార్యక్రమాలను పర్యవేక్షించాలని మంత్రి నారా లోకేశ్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు నారా లోకేశ్ రంగంలోకి దిగారు. బుడమేరు కుడివైపు, ఎడమవైపు పడిన గండ్ల గురించి అధికారులను అడిగి వివరాలను లోకేశ్ తెలుసుకున్నారు. గండ్లు పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. లోకేశ్ పర్యవేక్షణలో విజయవాడలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సీఎం ఆదేశాల మేరకు లోకేశ్ బుడమేరు వద్దకు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు….

Read More
భారీ వర్షాలు, వరదల నేపథ్యములో సోనూసూద్, ఆహారం, నీరు, మెడికల్ కిట్స్ అందించి, తాత్కాలిక షెడ్స్ ఏర్పాటు చేస్తానని తెలిపారు.

సోనూసూద్ సహాయం…. వరద బాధితుల కోసం ముందుకు వచ్చారు…

భారీ వర్షాలు, వరదలతో ఉభయ తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. వరదల కారణంగా భారీ ఆర్థిక నష్టం సంభవించింది. ఎంతోమంది వరదల్లో చిక్కుకుపోయారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడటం కోసం, వారికి నిత్యావసరాలు అందించేందుకు ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ నటుడు సోనూసూద్ తెలుగు రాష్ట్రాలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. మంచినీరు, ఆహారం, మెడికల్ కిట్స్ అందివ్వడంతో పాటు తాత్కాలిక షెడ్స్ ఏర్పాటు చేసేందుకు తన బృందం కృషి చేస్తుందన్నారు. ఈ…

Read More