
కోల్‌కతా డాక్టర్ హత్యపై తల్లిదండ్రుల ఆగ్రహం
కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో దారుణ హత్యాచారానికి గురైన డాక్టర్ కేసులో ఆమె తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేశారు. ఈ మర్డర్ కేసులో పోలీసులు మొదటి నుంచీ తమకు వ్యతిరేకంగానే ఉన్నారని, కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. ఇందుకోసం తమకు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేశారని తాజాగా వెల్లడించారు. వైద్యురాలి హత్యాచారాన్ని నిరసిస్తూ బుధవారం రాత్రి కోల్ కతా ఆర్జీ కర్ ఆసుపత్రి వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. వేల సంఖ్యలో జనం…