బుడమేరు గండ్లు పూడ్చేందుకు మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో ఆర్మీ సిబ్బంది చేరుకున్నారు. ఇనుపరాడ్లతో వంతెన నిర్మాణం చేపట్టనున్నారు.

బుడమేరు గండి పూడ్చే పనుల్లో ఆర్మీ సాయం

విజయవాడ వరదలకు ప్రధాన కారణంగా నిలిచిన బుడమేరుకు మూడు చోట్ల గండ్లు పడిన సంగతి తెలిసిందే. మంత్రి నిమ్మల రామానాయుడు రాత్రింబవళ్లు తేడా లేకుండా బుడమేరు కట్టపై మకాం వేసి, గండ్లు పూడ్చే పనులను పర్యవేక్షిస్తున్నారు.  జోరున వాన కురుస్తున్నా ఆయన కట్ట మీద నుంచి పక్కకి రాకుండా, సిబ్బందితో పనులు చేయిస్తున్నారు. నిమ్మల బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న, రాత్రి భోజనాలన్నీ బుడమేరు కట్టపైనే చేస్తున్నారు. ఇప్పటికే నిమ్మల ఆధ్వర్యంలో రెండు గండ్లు విజయవంతంగా పూడ్చారు.  ఇక,…

Read More
సెన్సెక్స్ 1017 పాయింట్లు, నిఫ్టీ 292 పాయింట్లు నష్టపోగా, బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.5.3 లక్షల కోట్లు తగ్గింది.

స్టాక్ మార్కెట్లలో భారీ పతనం, రూ.5.3 లక్షల కోట్లు నష్టం

భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ ఈ ఒక్కరోజే రూ.5.3 లక్షల కోట్లు తగ్గింది. సెన్సెక్స్ ఏకంగా 1017 పాయింట్లు క్షీణించి 81,183 వద్ద, నిఫ్టీ 292 పాయింట్లు నష్టపోయి 24,852 వద్ద స్థిరపడింది. అమెరికా ఫెడ్ రేటు తగ్గింపు అంచనాలు, యూఎస్ ఉద్యోగ నివేదికకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు. మార్కెట్ భారీ పతనం కారణంగా బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.5.3…

Read More
ప్రధాని మోదీ ఆదేశాల మేరకు తెలుగు రాష్ట్రాల్లో వరద నష్ట అంచనా, సహాయక చర్యలకు కేంద్రం నిపుణుల బృందాలు పంపి, 26 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, హెలికాప్టర్లు సిద్ధం.

తెలుగు రాష్ట్రాల కోసం కేంద్రం నుండి పూర్తి సహకారం

ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాల మేరకు రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సహాయక చర్యలపై ఎక్స్ వేదికగా కేంద్ర హోంశాఖ వెల్లడించింది. వరద ప్రాంతాలకు ఇప్పటికే నిపుణుల బృందాన్ని పంపించినట్లు తెలిపింది. వరదలు, డ్యాంలు, వాటి భద్రతను కేంద్ర బృందం పరిశీలిస్తుందని వెల్లడించింది. వరద నష్టం అంచనాకు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది….

Read More
కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం కేసులో సంజయ్ రాయ్ ఒక్కడే నిందితుడు అని సీబీఐ నిర్ధారించింది, దర్యాప్తు తుది దశలో.

కోల్‌కతా హత్యాచారం కేసులో ఒక్కరే నిందితుడు అని నిర్ధారించిన సీబీఐ

గత నెలలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం ఘటనలో సంజయ్ రాయ్ ఒక్కడే నిందితుడు అని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. ఆర్‌జీ కర్ హాస్పిటల్‌లో జరిగిన ఈ దారుణ ఘటనలో ఇతరుల ప్రమేయం ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలుస్తోంది. లభ్యమైన సాక్ష్యాధారాలన్నీ సంజయ్ రాయ్‌ ఒక్కడే నిందితుడని సూచిస్తున్నాయంటూ సీబీఐ వర్గాలు చెప్పాయని ఓ జాతీయ మీడియా సంస్థ కథనం పేర్కొంది. విచారణ చివరి దశలో ఉందని, త్వరలోనే ఛార్జిషీట్లు కూడా దాఖలు…

Read More
తప్పుడు కేసు వేధింపులపై ఏపీ పోలీసులకు నటి కాదంబరి ఫిర్యాదు. విద్యాసాగర్ కుట్రలో భాగమని, కుటుంబానికి రక్షణ కోరుతూ మీడియా వాఖ్యలు.

ఏపీ పోలీసులపై నటి కాదంబరి ఫిర్యాదు… తప్పుడు కేసుల ఆరోపణ..

ఏపీ పోలీస్ ఉన్నతాధికారులపై బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు కేసు పెట్టి, అరెస్టు చేసి వేధింపులకు గురి చేసిన వ్యవహారంలో నాటి విజయవాడ సీపీ కాంతి రాణా, డీసీపీ విశాల్ గున్ని, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు కీలకంగా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నది. గురువారం రాత్రి విజయవాడ సీపీ కార్యాలయానికి చేరుకున్న నటి కాదంబరి .. దర్యాప్తు అధికారి ఏసీపీ స్రవంతి రాయ్ ను కలిసి ఫిర్యాదు అందజేసింది. వైసీపీ నేత కుక్కల…

Read More
హైద‌రాబాద్‌లో జూబ్లీహిల్స్ ఐస్‌క్రీమ్ పార్ల‌ర్‌లో విస్కీ క‌లిపి ఐస్‌క్రీమ్ అమ్మకం. యజమానులు అదుపులో, తల్లిదండ్రులు ఆందోళన.

జూబ్లీహిల్స్‌లో విస్కీ ఐస్‌క్రీమ్ దందా… ఇద్దరు అదుపులో….

హైద‌రాబాద్‌లో విస్కీ ఐస్‌క్రీమ్‌ల దందా వెలుగులోకి వ‌చ్చింది. జూబ్లీహిల్స్‌లోని వన్ అండ్ ఫైవ్ ఐస్‌క్రీమ్ పార్ల‌ర్‌పై జ‌రిపిన దాడుల్లో ఐస్‌క్రీమ్‌లో విస్కీ క‌లిపి అమ్ముతున్న‌ట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. 60 గ్రాముల ఐస్‌క్రీమ్‌లో 100 ఎంఎల్ విస్కీ క‌లిపి విక్ర‌యిస్తున్న‌ట్లు అధికారులు క‌నుగొన్నారు.  ఈ ఐస్‌క్రీమ్‌ల‌ను పిల్ల‌లు, యువ‌త భారీ మొత్తంలో కొనుగోలు చేస్తున్న‌ట్లు పోలీసుల‌కు తెలిసింది. దీంతో త‌నిఖీలు నిర్వ‌హించి ఐస్‌క్రీమ్ పార్ల‌ర్ య‌జ‌మానులు ద‌యాక‌ర్ రెడ్డి, శోభ‌న్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. న‌గ‌రంలో ఇంకా…

Read More
బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. 'సింబ ఈజ్ కమింగ్' అంటూ ఫస్ట్ లుక్ విడుదల, అభిమానులు విపరీతంగా ప్రశంసలు.

మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ……. ఫస్ట్ లుక్ విడుదల….

నందమూరి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. బాలకృష్ణ వారసుడు, జూనియర్ నటసింహం మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ‘హనుమాన్’ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ఈరోజు మోక్షజ్ఞ పుట్టినరోజును పురస్కరించుకుని ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ లో మోక్షజ్ఞ చాలా క్యూట్ గా ఉన్నాడు. ‘సింబ ఈజ్ కమింగ్’ అంటూ ఫస్ట్ లుక్ పై పేర్కొన్నారు. మోక్షజ్ఞ ఫస్ట్ లుక్…

Read More