చేగుంటలో వినాయక మండపం వద్ద ఉత్సవాలు ఘనంగా నిర్వహించి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ దంపతులు ప్రత్యేక పూజలు చేసి గ్రామాభివృద్ధి కోరుకున్నారు.

చేగుంటలో వినాయక నగర్ ఉత్సవాలు ఘనంగా

చేగుంట మండల కేంద్రంలో యువ చైతన్య యూత్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద వినాయక నగర్ ఉత్సవాల ఘనంగా నిర్వహిస్తున్నారు చేగుంట మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ చేగుంట గ్రామం తో పాటు మండల ప్రజలంతా కూడా సంతోషంగా ఉండాలని మండలమంతా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని, ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఆ విగ్నేశ్వరుడు చల్లగా చూడాలని ఆయన స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు, వివిధ…

Read More
ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్ 20 రోజులపాటు విద్యార్థినిని హోటల్‌లో నిర్బంధించి అఘాయిత్యం. షీ టీమ్స్ స్పందించి బాధితురాలిని రక్షించారు.

హోటల్‌లో 20 రోజులపాటు విద్యార్థిపై అఘాయిత్యం

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఓ విద్యార్థిని హోటల్ గదిలో నిర్బంధించిన ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్ 20 రోజులపాటు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న ‘షీ టీం‘ పోలీసులు బాధితురాలిని రక్షించారు. పోలీసుల కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లాలోని భైంసాకు చెందిన బాధిత విద్యార్థికి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడు బెదిరించి హైదరాబాద్ పిలిపించుకున్నాడు. అక్కడికెళ్లాక నారాయణగూడలోని ఓ హోటల్ రూముకు తీసుకెళ్లి అందులో నిర్బంధించాడు. 20 రోజుల పాటు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయాన్ని ఆమె తన తల్లిదండ్రుకు ఫోన్…

Read More
అల్పపీడనంతో ఉత్తర కోస్తా ఆంధ్ర, గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు, వరద ముప్పు. పలు రోడ్లు మూసివేత, విద్యా సంస్థలకు సెలవు.

ఆంధ్ర‌లో భారీ వర్షాలు, రెడ్ అలర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రా, గోదావరి జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్న విష‌యం తెలిసిందే. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమై రోడ్డు రవాణాకు అంతరాయం క‌లుగుతోంది. ఉమ్మ‌డి జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో వరుసగా రెండోరోజు సోమవారం కూడా ఎడ‌తెరిపిలేని వర్షం కురుస్తోంది. దీంతో భారీగా వ‌ర‌ద‌నీరు పోటెత్తి రోడ్లు, పొలాలు నీట మునిగాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున వ‌స్తున్న వ‌ర‌ద‌నీరు కార‌ణంగా వాగులు పొంగిపొర్లుతున్నాయి….

Read More
బెంగళూరులో ఓ యువతిపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని స్థానికులు పట్టుకుని దుస్తులు విప్పించి చితకబాదారు. 3 మంది అరెస్ట్.

మహిళపై అసభ్యకర ప్రవర్తన చేసిన వ్యక్తికి గుంపు దాడి

ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా, ఆమె శరీర భాగాలు తాకిన 33 ఏళ్ల వ్యక్తిని కొందరు పట్టుకుని దుస్తులు విప్పించి చితకబాదారు. బెంగళూరు శివారులోని కాల్‌కరే గ్రామంలో జరిగిందీ ఘటన. ధర్వాడ్‌కు చెందిన బాధితుడు రవికుమార్ రెండేళ్లుగా కాల్‌కరే సమీపంలోని ఓ హోటల్‌లో కుక్‌గా పనిచేస్తున్నాడు. రాత్రి పది గంటల సమయంలో ఓ యువతి (20) పాలు కొనేందుకు రోడ్డుపైకి వచ్చింది. ఆమెను చూసిన రవికుమార్ అసభ్యంగా ప్రవర్తిస్తూ శరీరాన్ని అనుచితంగా తాకాడు. దీంతో ఆమె…

Read More
కాళింది ఎక్స్‌ప్రెస్‌ ట్రాక్‌పై సిలిండర్ ఉంచిన వ్యక్తుల వల్ల ప్రమాదం తప్పింది. లోకోపైలట్‌ సమయస్పూర్తితో ఎమర్జెన్సీ బ్రేక్ వేసి రైలు నిలిపాడు.

ప్రయాగ్‌రాజ్-భివానీ రైలుకు పెను ప్రమాదం తప్పింది

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్-భివానీ కాళింది ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. కాన్పూర్‌లోని ముదేరి గ్రామంలో నిన్న ఉదయం రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తులు గ్యాస్ సిలిండర్ పెట్టారు. గమనించిన లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేక్ వేయడంతో రైలు సరిగ్గా అక్కడికొచ్చి దానిని ఢీకొట్టి ఆగింది. లేదంటే పెను ప్రమాదమే జరిగి ఉండేదని రైల్వే అధికారులు తెలిపారు.  నిన్న ఉదయం 8.20 గంటల సమయంలో జరిగిందీ ఘటన. రైలు హర్యానాలోని భివానీ వెళ్తుండగా శివరాజ్‌పూర్ దాటిన తర్వాత పట్టాలపై…

Read More
అనసూయ, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో 'సింబా' సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. హత్యలు, విచారణ నేపథ్యంలో సీరియస్ కథతో, సక్సెస్‌ఫుల్ మిస్టరీ నెరవేర్చింది.

‘సింబా’ సినిమాను ‘ఆహా’లో స్ట్రీమింగ్

జగపతిబాబు .. అనసూయ ప్రధానమైన పాత్రలను పోషించిన ‘సింబా’ సినిమా, ఆగస్టు 9వ తేదీన థియేటర్లకు వచ్చింది. స్క్రీన్ ప్లే – మాటలు అందించింది దర్శకుడు సంపత్ నంది. ఈ సినిమాకి ఆయన ఒక నిర్మాత కూడా. ఈ సినిమాకి మురళీ మనోహర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. అలాంటి ఈ సినిమా ఈ రోజు నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేమిటన్నది ఇప్పుడు చూద్దాం.  అక్ష (అనసూయ) హైదరాబాద్ లోని ఒక స్కూల్లో టీచర్…

Read More
ఏఐసీసీ ప్రకటన మేరకు మహేశ్ కుమార్ గౌడ్ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. రేవంత్ రెడ్డి పదవీకాలం ముగిసిన అనంతరం ఆయన నియామకం జరిగింది.

మహేశ్ కుమార్ గౌడ్ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియామకం

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవీకాలం గత జులై 7వ తేదీతో ముగిసింది. దీంతో ఆయన స్థానంలో అధ్యక్ష పదవికి పలువురు సీనియర్ నేతలు పోటీ పడ్డారు. ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పోటీ పడ్డారు. అధిష్ఠానం మహేశ్…

Read More