
సీతానగరంలో ఉచిత కంటి వైద్య శిబిరం
పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతానగరం మండలంలో ఉచిత కంటి వైద్య శిబిరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో ఏర్పాటు చేయబడింది. ఈ శిబిరాన్ని డాక్టర్ జాక్సన్ గారు మరియు పి.ఆర్.ఓ అశ్విన్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. శిబిరంలో కంటి సంబంధిత చికిత్సలు పొందేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది పేషెంట్లకు వైద్యులు ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. వివిధ కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా వైద్యసేవలు అందించారు. పరీక్షల…