Andesri Passed Away తెలంగాణ గీత రచయిత అందెశ్రీ కన్నుమూత

Andesri Passed Away: తెలంగాణ గీత రచయిత అందెశ్రీ కన్నుమూత 

తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రముఖ సాహితీవేత్త అందెశ్రీ (64) కన్నుమూశారు. లాలాగూడలోని తన నివాసంలో అకస్మాత్తుగా పడిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడికి చేరుకునేలోపే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటనతో సాహిత్య వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. జనగాం సమీపంలోని రేబర్తి గ్రామంలో జన్మించిన అందెశ్రీ అసలు పేరు “అందె ఎల్లయ్య”. చిన్ననాటి నుంచే ఆయనకు కవిత్వం, సాహిత్యం పట్ల ఆసక్తి ఉండేది. తన భావోద్వేగాలు,…

Read More
మా ఇల్లు పింఛన్‌ కాలిపోయాయి వృద్ధ దంపతుల ఆవేదన

మా ఇల్లు పింఛన్‌ కాలిపోయాయి వృద్ధ దంపతుల ఆవేదన   

మా ఇల్లు పింఛన్‌ కాలిపోయాయి వృద్ధ దంపతుల ఆవేదన:కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ పాత కోరంగి గ్రామంలో ఉదయం 6 గంటల సమయంలో తీవ్ర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో వృద్ధ దంపతులు చేకూరి అమ్మన్న, కళావతి నివసిస్తున్న ఇల్లు పూర్తిగా మంటలకు ఆహుతైంది. గత 40 ఏళ్లుగా ఆ ఇంట్లో నివసిస్తున్న వీరి జీవిత సంపాద్యమంతా క్షణాల్లో బూడిదైపోయింది. తెల్లవారుజామున ఒక్కసారిగా ఇంటి పైకప్పు నుంచి మంటలు ఎగసిపడటాన్ని గమనించిన…

Read More
అమీన్‌పూర్‌ తహసీల్దార్‌ కార్యాలయం

ప్రభుత్వ భూమి కాపాడేందుకు వెళ్లిన అమీన్‌పూర్‌ తహసీల్దార్‌పై దాడి

పటాన్‌ చెరు అర్బన్‌: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ తహసీల్దార్‌ వెంకటేశ్‌పై దారుణ దాడి జరిగింది. ఈ ఘటన కొన్ని రోజుల క్రితం చోటు చేసుకున్నప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే — అమీన్‌పూర్‌ మండల పరిధిలోని 630 సర్వే నంబర్‌లో ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించి, ఆ భూమిపై షెడ్డు నిర్మించారు. ఈ సమాచారం అందుకున్న తహసీల్దార్‌ వెంకటేశ్‌ సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి, ఆ షెడ్డు తొలగించాలని ఆదేశించారు. కానీ, తహసీల్దార్‌…

Read More
బాపట్ల సూర్యలంక బీచ్‌లో పర్యాటకులు తిరుగుతున్న దృశ్యం

సముద్ర తీరంలో మళ్లీ సందడి – తెరుచుకున్న సూర్యలంక బీచ్‌ గేట్లు 

ఎట్టకేలకు బాపట్ల సూర్యలంక బీచ్‌ గేట్లు మళ్లీ తెరుచుకున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు తాళాలు తీసివేయడంతో పర్యాటకుల్లో ఉత్సాహం నెలకొంది. ముఖ్యంగా కార్తీక మాసం కావడంతో భక్తులు, సందర్శకులు పెద్ద సంఖ్యలో సముద్ర తీరానికి రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ముంథా తుఫాను ప్రభావంతో బీచ్‌లో గుంతలు ఏర్పడటంతో భద్రతా కారణాల రీత్యా కొంతకాలం పాటు బీచ్‌కు ప్రవేశం నిషేధించారు. ఇప్పుడు పరిస్థితులు సాధారణమయ్యాయని నిర్ధారించుకున్న అధికారులు పర్యాటకులను బీచ్‌కు అనుమతించారు. కార్తీక మాసం సందర్భంగా…

Read More
Deputy CM Pawan Kalyan visiting Mamanduru forest area in Tirupati district

తిరుపతి మామండూరులో పవన్‌ కళ్యాణ్‌ అటవీ పర్యటన సందడి

తిరుపతి మామండూరులో పవన్‌ కళ్యాణ్‌ అటవీ పర్యటన సందడి:తిరుపతి జిల్లా మామండూరులో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ పర్యటించారు. అటవీ ప్రాంతాన్ని సందర్శించిన ఆయన, పర్యావరణ పరిరక్షణలో భాగంగా అధికారులు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. ALSO READ:గుంటూరులో దారుణం అప్పు ఇవ్వలేదని హ*త్య అనంతరం మంగళంలోని ఎర్రచందనం గోదామును పరిశీలించి, అక్కడి భద్రతా ఏర్పాట్లు, నిల్వ పరిస్థితులను సమీక్షించారు. ఎర్రచందనం రక్షణకు తీసుకుంటున్న చర్యలపై పవన్‌ కళ్యాణ్‌ అధికారుల నుండి వివరాలు తెలుసుకున్నారు. అలాగే తిరుపతి…

Read More
కొత్తకోట వద్ద కారు, లారీ ఢీ – పంచాయతీ సెక్రటరీ సతీష్ రెడ్డి మృతి

కొత్తకోట వద్ద రోడ్డు ప్రమాదం – పంచాయతీ సెక్రటరీ సతీష్ రెడ్డి దుర్మరణం

గద్వాల జిల్లా కొత్తకోట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గద్వాలలో జరిగిన ఓ వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా, వేముల గ్రామ పంచాయతీ సెక్రటరీ సతీష్ రెడ్డి ఉన్న కారు దుర్ఘటనకు గురైంది. కొత్తకోట సమీపంలో కారు ఆగి ఉండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఆ కారును ఢీకొట్టి బోల్తా పడింది. ఢీ అంత భయంకరంగా ఉండడంతో కారు పూర్తిగా దెబ్బతిన్నది. ఈ ప్రమాదంలో సెక్రటరీ సతీష్ రెడ్డి తీవ్రంగా గాయపడి, ఆసుపత్రికి…

Read More
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల చర్చల అనంతరం భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సమాఖ్య ప్రతినిధులు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై చర్చలు సఫలం – కళాశాలల బంద్‌ విరమణ

హైదరాబాద్‌: తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల సమస్యపై ప్రభుత్వం, ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నేతృత్వంలో ప్రజాభవన్‌లో నాలుగు గంటలపాటు చర్చలు జరిపిన అనంతరం ఒప్పందం కుదిరింది. ప్రైవేట్‌ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య (ఫతి) బంద్‌ విరమిస్తున్నట్లు ప్రకటించింది. చర్చలలో ప్రభుత్వం రూ.1,500 కోట్లు వెంటనే చెల్లించడానికి అంగీకరించింది. ఇందులో ఇప్పటికే రెండు విడతల్లో రూ.600 కోట్లు విడుదల చేసినట్లు, మరో రూ.600…

Read More