Telangana Cabinet Meeting:స్థానిక సంస్థల ఎన్నికల తేదీలపై నిర్ణయం?
నేడు తెలంగాణలో ముఖ్యమైన పరిణామానికి వేదిక కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్‌లో కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశం ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల సిద్ధతపై దృష్టి సారించనున్నట్లు సమాచారం. పంచాయతీలు, మున్సిపాలిటీల ఎన్నికల తేదీలను ఖరారు చేసే అవకాశముంది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల అంశంపై కేబినెట్ కీలక చర్చలు జరపనుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందుగా రిజర్వేషన్ వ్యవస్థను స్పష్టంగా తేల్చాల్సి ఉండటంతో ఈ సమావేశం కీలకంగా మారింది….
