Happy Sunday Program | ఏపీలో తిరిగి ‘హ్యాపీ సండే కార్యక్రమం
Happy Sunday Program: ప్రజల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు సామాజిక ఆనందాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో రూపొందించిన “హ్యాపీ సండే” కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మళ్లీ ప్రారంభం కానుంది. ఇకపై ప్రతి నెలలో “రెండో మరియు నాలుగో ఆదివారాల్లో” రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి స్థాయి మార్గదర్శకాలను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసింది. గతంలో 2014–2019 మధ్యకాలంలో ఈ కార్యక్రమం నిర్వహించినప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన…
