Revanth Reddy | మోదీ దేశానికి పెద్దన్న…అన్ని రాష్ట్రాలకి సహకరించాలి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ అభివృద్ధిలో రాష్ట్రాల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశానికి పెద్దన్నగా సహకరిస్తే అన్ని రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని చెప్పారు. హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్‌లో నైరుతి రాష్ట్రాల పట్టణాభివృద్ధి మంత్రుల ప్రాంతీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులకు కేంద్రం త్వరగా అనుమతులు మంజూరు చేస్తే హైదరాబాద్ అభివృద్ధి వేగవంతమవుతుందని, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా సానుకూల ప్రభావం పడుతుందని ముఖ్యమంత్రి…
