Telangana Politics | వదలొద్దు..కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వండి
Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో అధికార మరియు ప్రతిపక్షాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు ఉదృతంగా మారుతున్నాయి. మాజీ సీఎం కేసీఆర్(KCR) ప్రాజెక్టులపై చేసిన వ్యాఖ్యలను గట్టిగా తిప్పికొట్టాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. “వదలొద్దు.. ప్రతిమాటకు కౌంటర్ ఇవ్వాలి” అంటూ మంత్రుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రుల సమావేశంలో కీలక చర్చ సోమవారం సాయంత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన సమావేశంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సీఎం హర్షం వ్యక్తం…
