Hyderabad Expansion: దేశంలో అతిపెద్ద నగరంగా హైదరాబాద్ అవతరణ
దేశంలో అతిపెద్ద నగరంగా హైదరాబాద్ అవతరించబోతుంది. హైదరాబాద్ మహానగరాన్ని దేశంలోనే అతిపెద్ద నగరంగా రూపుదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిని భారీ స్థాయిలో విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈ క్రమంలో GHMCలో 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదనంగా, ఔటర్ రింగ్ రోడ్ (ORR) వరకు మరియు ORRను ఆనుకుని ఉన్న కొన్ని పరిసర ప్రాంతాలను కూడా గ్రేటర్ పరిధిలో చేర్చే…
