ఉచిత ఇసుక పథకం దారితప్పింది..
ఉచిత ఇసుక పథకం దారితప్పింది దళారుల దోపిడీతో ఇబ్బంది పడుతున్న ప్రజలు.ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టిన ఉద్దేశ్యం ప్రజలకు ఇసుక సులభంగా, తక్కువ ధరకు అందించడమే. అయితే కొందరు దళారులు ఈ పథకాన్ని తమ స్వార్ధ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. ప్రభుత్వం నిబంధనలను సడలించినా, దాన్ని ఇసుకాసురులు తమకనుకూలంగా మార్చుకుని భారీ లాభాలు పొందుతున్నారు. దీంతో సామాన్య ప్రజలు ఇసుక కోసం గగ్గోలు పెడుతున్నారు. తోట్లవల్లూరు మండలంలోని రొయ్యూరు, చాగంటిపాడు, కళ్లంవారిపాలెం, ఐలూరు గ్రామాల్లోని ఇసుక క్వారీల్లో…
