Telangana Panchayat Elections:పంచాయతీ ఎన్నికల్లో 90% విజయమే లక్ష్యం – రేవంత్ రెడ్డి టార్గెట్ ఫిక్స్
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ప్రజా పాలన వారోత్సవాలను డిసెంబర్ 9న ఘనంగా నిర్వహించి, రెండు రోజుల వ్యవధిలోనే తొలి విడత పోలింగ్ షెడ్యూల్ విడుదల చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. 5 రోజుల గ్యాప్‌తో మూడు విడతల్లో ఎన్నికలు జరిపి కొత్త పంచాయతీ పాలకవర్గాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ నెలాఖరులోనే నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 90 శాతం గ్రామాల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలని రేవంత్ లక్ష్యం. పార్టీ ఎమ్మెల్యేలు,…
