శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రెండో అతిపెద్ద కార్గో విమానం | Shamshabad Airport cargo plane
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం(RGI Airport)లో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద కార్గో విమానం ల్యాండింగ్ కావడం సంచలనంగా మారింది. ఈ భారీ విమానం మధ్యాహ్నం విమానాశ్రయ రన్‌వేపై దిగింది. దాదాపు 73 మీటర్ల పొడవు, 79 మీటర్ల రెక్కల విస్తీర్ణం కలిగిన ఈ విమానం అత్యాధునిక సాంకేతికతతో నిర్మించబడింది. ఇందులో సుమారు 140 టన్నుల వరకు సరుకు రవాణా సామర్థ్యం ఉంది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు ప్రయాణికులు, విమాన సిబ్బంది, మరియు విమానయాన అభిమానులు ఎయిర్‌పోర్ట్‌లోకి చేరుకున్నారు….
