హైదరాబాద్–విజయవాడ హైవేపై బస్సులో మంటలు – డ్రైవర్ సమయస్ఫూర్తితో తప్పిన పెద్ద ప్రమాదం
హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై మరో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. విహారీ ట్రావెల్స్‌కు చెందిన ఒక ప్రైవేట్ బస్సులో 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా, చిట్యాల మండలం పిట్టంపల్లి సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బస్సు ఇంజిన్ భాగం నుండి పొగ రావడం గమనించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బస్సును రోడ్డు పక్కన ఆపి, ప్రయాణికులను సురక్షితంగా బయటకు దించారు. క్షణాల వ్యవధిలోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. డ్రైవర్…
