సుశాంత్ సింగ్ సోదరి దివ్యా గౌతమ్ బీహార్ అసెంబ్లీ బరిలో – లెఫ్ట్ పార్టీ టికెట్‌పై పోటీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి దివ్యా గౌతమ్ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎంఎల్) తరఫున ఆమె దిఘా నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నారు. దివ్యా గౌతమ్ గతంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) అధ్యక్షురాలిగా పనిచేశారు. విద్యార్థి ఉద్యమాల ద్వారా ప్రజల్లో గుర్తింపు పొందిన ఆమె, ఇప్పుడు రాజకీయ రంగంలో అడుగుపెడుతున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ టికెట్‌పై పోటీ చేసేందుకు రేపు నామినేషన్…
