
పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికల వేడెక్కిన ప్రచారం – టీడీపీ, వైఎస్సార్సీపీ ఘర్షణలతో ఉద్రిక్తత
కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికల ప్రచారం వేడెక్కింది. వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గాల మధ్య ఉద్రిక్తతలు పెరిగి, రెండు పార్టీల నాయకులు, శ్రేణులు ఘర్షణలకు దిగడంతో పరిస్థితి తీవ్రతరం అయింది. ముఖ్యంగా మంగళవారం, బుధవారం జరిగిన పరిణామాలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడి చేశాయి. బుధవారం నల్లగొండువారిపల్లెలో టీడీపీ ప్రచారం నిర్వహించుకోవాల్సి ఉండగా, వైఎస్సార్సీపీ నేతలు – ఎమ్మెల్సీ రమేష్, వేల్పుల రామలింగారెడ్డి అక్కడికి చేరుకుని ఓటర్లపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారని టీడీపీ ఆరోపించింది. దీంతో…