చంద్రబాబు – తుఫాను సమయంలో కృషి చేసిన మంత్రులపై ప్రశంసలు
AMARAVATHI: సీఎం చంద్రబాబు నాయకత్వంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల సంభవించిన “మొంథా తుఫాను” సమయంలో క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేసిన మంత్రులను సీఎం చంద్రబాబు అభినందించారు. ప్రతి మంత్రి స్వయంగా ప్రజల్లోకి వెళ్లి, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగంగా జరిగేలా కృషి చేశారని ఆయన ప్రశంసించారు. తుఫాను సమయంలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికారులు సమన్వయంతో వ్యవహరించారని, అందువల్లే సహాయక చర్యలు అత్యంత వేగంగా పూర్తి చేయగలిగామని…
